విధుల పట్ల అలసత్వం వద్దు

ప్రభుత్వ సిహెచ్ సి వైద్యశాలను, కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
వెల్దుర్తి ఆగస్టు 22 యువతరం న్యూస్:
మండల కేంద్రమైన వెల్దుర్తి లోని ప్రభుత్వ సిహెచ్ సి వైద్యశాలను మరియు కస్తూరిబా గాంధీ పాఠశాలను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ సి లో కలియ తిరుగుతూ వైద్యశాలను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వైద్యులు జిల్లా కలెక్టర్ కు వైద్యశాల గురించి తెలపడం జరిగింది.అనంతరం కస్తూరిబా గాంధీ పాఠశాలను పరిశీలించారు. అక్కడ విద్యార్తినిలతో ముచ్చటించారు. అంతేకాకుండా విద్యలో మంచిగా రాణించి ఉన్నత స్థాయికి ప్రతి ఒక్కరూ చేరుకోవాలని జిల్లా కలెక్టర్ విద్యార్థినిలకు తెలిపారు. అదేవిధంగా పాఠశాలకు వస్తున్న వస్తువుల నాణ్యతను పరిశీలించారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ మరియు రహదారి కావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.