ANDHRA PRADESHPROBLEMS
పోలీస్ క్వార్టర్లలో పేరుకుపోయిన మురుగునీరు

పోలీస్ క్వార్టర్లలో పేరుకుపోయిన మురుగునీరు
వెల్దుర్తి ఆగస్టు 20 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి లోని పోలీస్ క్వార్టర్సులలో మురుగునీరు పేరుకుపోయింది. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి చెత్తాచెదారం అంతా పోలీస్ క్వార్టర్లలోనికి చేరుకుంది. ముఖ్యంగా మురికి కాలువలు పేరుకుపోవడంతో మురుగునీరు, వర్షపు నీరు వెళ్లే దారి లేక పోలీస్ క్వార్టర్ లోనికి చేరుకుంది. దీంతో సంబంధిత పోలీసులు పోలీసు క్వాటర్ లోనికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా దోమల బెడద ,పందుల బెడద ఎక్కువగా ఉంది. పారిశుద్ధ్య నిర్మూలన చేపట్టాల్సిన సంబంధిత అధికారులు ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనించదగ్గ విషయం.