ANDHRA PRADESHOFFICIAL
నాటు సారా నిర్మూలన పై ప్రత్యేక దృష్టి

సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించండి
క్రిష్ణగిరి ఆగస్టు 20 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా మల్లికార్జున సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామాలలో చిన్న,చిన్న వాటికి తగదాలు పడకుండా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. అలాకాకుండా చట్టాన్ని చేతులోనికి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యంగా అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. గ్రామాలలో నాటుసారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.