నాటు సారా తయారుచేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవు

గోవర్ధనగిరి లో గ్రామసభ నిర్వహించిన ఎస్సై అశోక్
వెల్దుర్తి ఆగస్టు 19 యువతరం న్యూస్:
వెల్దుర్తి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఆదివారం ఎస్సై అశోక్ తన సిబ్బందితో కలిసి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామంలో నాటుసార విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. అదేవిధంగా నాటు సారా తయారుచేసిన చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. గ్రామాలలో మట్కా నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.ముఖ్యంగా ప్రధాన వీధులలో సీసీ కెమెరాలు ఏర్పరచుకోవాలని ఎస్ఐ తెలిపారు. గ్రామాలలో కొత్తవాళ్లు సంచరిస్తే సమాచారం అందించాలన్నారు. గ్రామాలలో దొంగతనాలు జరగకుండా ప్రజలు కూడా సహకరించాలన్నారు. గ్రామాలలో కొత్త వ్యక్తులు అగుపడితే 9121101118 నంబర్ కు సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.