ANDHRA PRADESHOFFICIAL
కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు

ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే స్వాతంత్ర దినోత్సవము
సంజామల ఆగస్టు 15 యువతరం న్యూస్:
కోవెలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్, ఎస్సై వరప్రసాద్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్ జెండా ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగ ఫలితమే స్వాతంత్ర దినోత్సవం అన్నారు. ప్రతి ఒక్కరూ అమరవీరుల అడుగుజాడల్లో నడవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.