పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ దొంగల ముఠా అరెస్ట్
వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ మొబైల్ కేసు లో 9 మంది అరెస్ట్
ఇందులో ముగ్గురు పోలీసులు
హైదరాబాద్ బ్యూరో జూలై 30 యువతరం న్యూస్:
వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సెల్ ఫోన్ మొబైల్ కేసును లోతుగా దర్యాప్తు చేశాము అని తెలిపారు.
కేసులో భాగంగా 9 మందిని అరెస్ట్ చేసాం.. ఇందులో ఆరుగురు సభ్యులు.. మరో ముగ్గురు పోలీస్ శాఖకు చెందినవారు అన్నారు.
ముగ్గురులో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే హోమ్ గార్డ్, పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ సోమన్న, సైఫాబాద్ పీఎస్ కానిస్టేబుల్ సాయిరాం ఉన్నారు అని తెలిపారు.
జూలై 23న 743/3024 శ్నాచింగ్ కేసు నమోదు అయింది అన్నారు.
జూలై 23 ఎలమంజిల్ మెట్రో స్టేషన్ లో మెట్రో అధికారి సెల్ఫోన్ దొంగలించడానికి ఓ నిందితుడు ప్రయత్నించాడు అని తెలిపారు.
ఓ ప్రయాణికుడు ఆ దొంగను పట్టుకున్నాడు.. అనంత మెట్రో సిబ్బంది ఆ దొంగను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు అని తెలిపారు.
దీంతో 743/3024 ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి 24వ తేదీన రిమాండ్ చేశాము అన్నారు.
పట్టుబడ్డ నిందితుడు వెస్ట్ బెంగాల్ కు చెందిన అల్ అమీన్ ఘాజీ గా గుర్తించాము అని తెలిపారు.
అతన్ని విచారించగా పోలీస్ నగరంలో దొంగతనం చేయడానికి వచ్చాము అని వివరించడం జరిగిందన్నారు.
ముఠాగా ఏర్పడి దొంగలించిన మొబైల్స్ ను బంగ్లాదేశ్ తో పాటు ఇతర దేశాలకు పంపుతునట్టు చెప్పాడన్నారు.
ఆ నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఎంఎస్ మక్తా లో ఓ ఇంటిపై రైడ్ చేసాం అని తెలిపారు.
ఇంట్లో ఉన్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశాము అన్నారు.
విచారణా లో భాగంగా వారంతా బీహార్ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించాం అని తెలిపారు.
వారిని విచారిస్తున్నప్పుడు ముగ్గురు పోలీస్ సిబ్బంది తమకు సహకరించారని ఒప్పుకున్నారు అని తెలిపారు.
ఖచ్చితమైన సమాచారంతో ముగ్గురు పోలీస్ సిబ్బందిని విచారించాం వారు నేరం ఒప్పుకున్నారు అరెస్ట్ చేసాం అన్నారు.
మరో ఐదుగురు ముఠా సభలో పరారీలో ఉన్నారన్నారు.
గత కొన్నిల్లగా వ్యక్తిగతంగా దొంగతనాలకు పాల్పడిన వీరంతా కలిసి రెండు సంవత్సరాలుగా ఒక ముఠాగా ఏర్పడ్డారన్నారు.
ఈ ముటాలో కాంచన్, రాహుల్ కుమార్ యాదవ్ ఇద్దరు ప్రధాన నిందితులు అని తెలిపారు.
ఇతరు తమ ముఠాలను మెట్రో నగరాలకు పంపి వారి చేత దొంగతనాలు చేయిస్తూ ఉంటారన్నారు.
ఈ ముఠా చిన్న పిల్లలను కూడా ఎంగేజ్ చేసుకుని వారితో సెల్ఫోన్ స్నాచింగ్లు చేయిస్తున్నారన్నారు.
అరెస్ట్ అయిన 9 మందిలో 12 ఏళ్ల అబ్బాయి కూడా ఉన్నాడు అని తెలిపారు.
ఆ బాలుడు పై జువైనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసాం అన్నారు.
ముఠా సభ్యుల గత నేరచరిత్ర పై లోతైన దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు.
ఈ కేసులో పోలీసులు అరెస్ట్ అవ్వడం బాధాకరం.నేరస్తులతో చేతులు కలిపితే ఎంతటి వారనైనా వదిలిపెట్టం అని తీవ్రంగా హెచ్చరించారు.
ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ముఠాలోని ఒక సభ్యుడుని అరెస్ట్ చేశారన్నారు.
ఆ సమయంలో ఆ దొంగను విడిపించడానికి శాన్వాజ్ ఎస్ఆర్ నగర్ పీఎస్ కొచ్చారన్నారు.
అదే సమయంలో షాన్ వాజ్ కు హోంగార్డ్ అశోక్ కు పరిచయం ఏర్పడింది అని తెలిపారు.
అప్పటినుండి హోంగార్డుతో నిత్యం షాన్వాస్ టచ్ లో ఉన్నాడన్నారు.
సెల్ఫోన్ స్నాచింగ్లు చేయడానికి తన ముఠాను హైదరాబాదుకు పంపినప్పుడల్లా షాన్ వాజ్ ముఠా సభ్యుల ఫోటోలు హోంగార్డుకు పంపేవాడు అని తెలిపారు.
ముఠా సభ్యులు ఎక్కడ పట్టుబడిన హోంగార్డ్ వారిని విడిపించే వాడన్నారు.
జూన్ నెలలో ఎన్టీఆర్ మార్గ్ లో ముఠా లోని ఒక సభ్యుడుని సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.
ముఠా సభ్యుడిని హోంగార్డ్ అశోక్, అలాగే సోమన్న సైఫాబాద్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయిరాం ముగ్గురు కలిసి తప్పించారన్నారు.
ఇందుకు శానవాజ్ హోంగార్డు భార్య అకౌంట్లోకి రూ 19 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు అని తెలిపారు.
రూ.3000 సాయిరాం కు మరో మూడు వేలు సోమన్న కి హోంగార్డ్ అశోక్ ఇచ్చాడన్నారు.
వ్యవస్థీకృత నేరాలు పాల్పడుతున్న నిందితులకు ఈ ముగ్గురు పోలీసులు సహకరించారు అని తెలిపారు.
అంతకుముందు సెల్ఫోన్ స్నాచింగ్ చేసిన మొబైల్స్ అన్నిటినీ ఝార్ఖండ్ కు పంపించారన్నారు.
జార్ఖండ్ కు ఒక టీమును పంపించాం అని తెలిపారు.
దేశంలో ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడ్డారు ఆయా రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకొని కేసు లోతైన విచారణ చేస్తాం అన్నారు.
సెల్ఫోన్ దొంగతనాలను పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకుంటుంది అని తెలిపారు.
సెల్ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళు సీఐఆర్లో నమోదు చేసుకోవాలి అని తెలిపారు.