పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు ఖరారు

మధ్నాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు ఖరారు
అమరావతి జులై 29 యువతరం న్యూస్:
ఏపీ ప్రభుత్వం అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్నాహ్న భోజనం పథకం కింద ప్రతీ రోజు ప్రత్యేకంగా మెనూను సిద్దం చేసింది.దీని ప్రకారం ప్రతీ సోమవారం కూరగాయల పులావ్, కోడిగుడ్డు కూర,వేరుశనగ – బెల్లం చిక్కి అందించాలని నిర్ణయించారు.మంగళవారం పులిహోర,దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు,రాగిజావ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.బుధవారం కూరగాయల అన్నం, ఆలూ కూర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ చిక్కి ఇవ్వనున్నారు.గురువారం సాంబార్ బాత్, లెమన్ రైస్, టమోట పచ్చడి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రతీ శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ – బెల్లం చిక్కి మెనూలో చేర్చారు.ఇక..శనివారం మాత్రం ఆకుకూర అన్నం, పప్పుచార, రాగిజావ, స్వీట్ పొంగల్ తో కూడిన భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.