జలాదివాసంలో సంగమేశ్వరుడు

జలాధివాసంలో సంగమేశ్వరుడు
సంగమేశ్వర ఆలయాన్ని చుట్టుముట్టిన కృష్ణా జలాలు
కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు
కొత్తపల్లి జులై 24 యువతరం న్యూస్:
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తడంతో మంగళవారం సప్తనదుల సంగమేశ్వర ఆలయాన్ని వరద జలాలు చుట్టుముట్టాయి. శ్రీ లలిత సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఓడికి చేరాడు. సంగమేశ్వరుడు జలాధివాసం ముందుగా ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ సప్త నదులకు ఒడి బియ్యం సమర్పించి గంగాహారతి జలాదివాస పూజలు జయ మంగళ హారతి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గర్భ గుడిలోని శ్రీ లలితా సంగమేశ్వర స్వామి జలాధివాసంలోకి వెళుతున్న సందర్భంగా రుద్రాభిషేకం పంచామృత అభిషేకాలు విశేష పూజలు మహా మంగళహారతి పూజలు నిర్వహించారు.ప్రతి సంవత్సరం 8 నెలలు నీళ్లలో ఉండి నాలుగు నెలలు మాత్రమే బయటపడే ఆలయం ఈసారి 8 నెలలు బయట ఉండడం విశేషం. కృష్ణా జలాలు సంగమేశ్వర గర్బాలయం చుట్టుముట్టడంతో సంగమేశ్వరుని దర్శించు కొనుటకు అధిక సంఖ్యలో వచ్చారు. శ్రీశైల జలాశయా పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 842.4 అడుగులకు చేరింది.