ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWS
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృత్యువాత

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
వెల్దుర్తి జూలై 24 యువతరం న్యూస్:
స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో తోగర్చేడు రహదారిలో యువకుడు మృత్యువాత పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృత్యువాత పడిన యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెల్దుర్తి పట్టణానికి చెందిన పెద్ద రాముడు కుమారుడు మధు శేఖర్(21) తోగర్చేడు రహదారి పక్కన పొలాల్లో మంగళవారం ఉదయానికి విగతాజీవిగా పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితి గా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.