కాజా భూములకు మహర్దశ, హాఫ్ క్లోవర్ జంక్షన్ ఏర్పాటు

కాజ భూములకు మహర్దశ
హాఫ్ క్లోవర్ జంక్షన్ ఏర్పాటు
విజయవాడ పశ్చిమ, తూర్పు బైపాస్‌లు ప్రారంభం ఇక్కడే
మంగళగిరి ప్రతినిధి జులై 23 యువతరం న్యూస్:
అమరావతి రాజధాని ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలోని కాజకు మహర్దశ పట్టనుంది. కాజ వద్ద ఎన్‌హెచ్–16పై బెజవాడ పశ్చిమ, తూర్పు బైపాస్‌లు కలిసేచోట హాఫ్ క్లోవర్ జంక్షన్ ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) ప్రతిపాదన సిద్ధం చేసింది. రెండు బైపాస్‌లు ఒకే దగ్గర కలిసేచోట హాఫ్ క్లోవర్ జంక్షన్ వల్ల ఈ ప్రాంతం కొత్త రూపును సంతరించుకోనుంది. రెండు బైపాస్‌ల మీదుగా వచ్చే ట్రాఫిక్, ఎన్‌హెచ్–16 మీదుగా రాకపోకలు సాగించే ట్రాఫిక్‌కు ఎక్కడా అవాంతరాలు కలగకుండా సాఫీగా సాగిపోవడానికి ఈ హాఫ్ క్లోవర్ జంక్షన్ దోహదపడుతుంది. దీని వల్ల కాజ, మంగళగిరి ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందనుంది. ప్రస్తుతం ఆరు వరసలతో కూడిన జాతీయ రహదారిగా ఉన్న ఎన్‌హెచ్–16కు చిన్న అవుటపల్లి నుంచి విజయవాడ పశ్చిమ బైపాస్ కాజ దగ్గర అనుసంధానమవుతుంది. చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు ప్యాకేజీ–3లో 90 శాతం మేర, ప్యాకేజీ–4లో భాగంగా కృష్ణానది మీద బ్రిడ్జి, కాజ వరకు రోడ్డు పోర్షన్ పనులు 60 శాతం మేర పూర్తయ్యాయి. మరో ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది. అలాగే పొట్టిపాడు నుంచి ప్రతిపాదిత తూర్పు బైసాస్ కూడా కాజ దగ్గర ఎన్‌హెచ్–16కు కలవనుంది. ఈ రెండు బైపాస్‌లూ ఆరు వరసలతో నిర్మిస్తున్న నేపథ్యంలో.. కాజ ప్రాంతంలో హాఫ్ క్లోవర్ జంక్షన్ కంటే కూడా బటర్‌ఫ్లై క్లోవర్ జంక్షన్ ఏర్పాటు చేస్తే బాగుటుందనే వాదన వినిపిస్తోంది.
అనుసంధానమవుతాయి. వీటికి తోడు విజయవాడ–ఛత్తీస్‌గఢ్ (ఎన్‌హెచ్– 30), ఖమ్మం–విజయవాడ (ఎన్‌హెచ్–216 హెచ్), క త్తిపూడి–ఒంగోలు (ఎన్‌హెచ్–216) వంటి వాటితో పాటు ప్రధానంగా ఎన్‌హెచ్–16, ఎన్‌హెచ్–65లు అనుసంధానమవుతాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును తలపెడితే దీని నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధాన మార్గాలు ఉంటాయి. కాబట్టి విజయవాడ పశ్చిమ, తూర్పు బైపాస్‌లు అనుసంధానమయ్యేచోట హాఫ్ క్లోవర్ జంక్షన్ కంటే కూడా బటర్ ఫ్లై క్లోవర్ జంక్షన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాజధాని ప్రాంతం కావడం వలన భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూసేకరణ అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో ఎనిమిది వరసలుగా చేయాల్సి వచ్చినపుడు కూడా హాఫ్ క్లోవర్ జంక్షన్ సమస్య కాకుండా ఉండాలంటే.. పూర్తిస్థాయి బటర్‌ఫ్లై క్లోవర్ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలన్న డిమాండ్ స్థానికంగా వ్యక్తమవుతోంది.
పెట్టుబడులకు సరైన సమయం ఇదే : కంకణాలు శంకర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి
విజయవాడ గుంటూరు జంట నగరాల మధ్య కాజ గ్రామం ఉంది. ఇక్కడ భూములు కొంటే మంచి పెరుగుదల ఉంటుంది. విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు కూడా కాజా నుండే ప్రారంభమవుతుంది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో మాదాపూర్ కొండాపూర్ గచ్చిబౌలి వంటి ప్రాంతాలు ఏ తరహాలో అభివృద్ధి చెందాయో భవిష్యత్తులో ఈ కాజా ప్రాంతం కూడా అలా మారబోతోంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వెనుక ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ప్రారంభించి నిలిచిపోయిన ప్రాజెక్టును కూడా మరో పెద్ద సంస్థలు టేక్ ఓవర్ చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన సంప్రదింపులు పూర్తవుతున్నాయి. టేక్ ఓవర్ పూర్తయితే ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయి. కొత్తగా భూములు పై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వారు కొద్ది నెలల్లోనే మంచి లాభాలు పొందుతారు.