అవధూత శ్రీ రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

అవధూత శ్రీ రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
దాసరి రామచంద్రా రెడ్డి సంస్థాన్ అధ్యక్షులు
కర్నూలు ప్రతినిధి జులై 22 యువతరం న్యూస్ :
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ పూర్ణిమ ఆదివారం గురుపూర్ణిమ – పర్వదినం పురస్కరించుకొని లోక కళ్యాణార్ధము అవధూత రామిరెడ్డి తాత శ్రీవారి దివ్య ఆశీస్సులతో కర్నూలు నగర పరిధిలోని కల్లూరులో అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ లో గురుపూర్ణిమ వేడుకలు సంస్థాన్ అధ్యక్షులు దాసరి రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా సంస్థాన్ అధ్యక్షులు దాసరి రామచంద్రా రెడ్డి గో సేవకులు ఎస్.రామారావులు మాట్లాడారు.సంస్థాన్ లో అభిషేకం,అర్చన మహా మంగళ హారతి విష్ణు సహస్రనామ పారాయణం లలిత సహస్రనామ పారాయణం హారతి అనంతరం అన్నప్రసాదం సంధ్యాహారతి పల్లకి సేవ నామ సంకీర్తన (భజన) వంటి కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థాన్ సెక్రటరీ ఎన్ మల్లేష్,కోశాధికారి ఈ. హనుమంత్ రెడ్డి కమిటీ సభ్యులు శ్రీనివాసులు భక్తులు సాయిరాం రెడ్డి సి. శ్రీనివాసులు కల్లూరు మండల ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.