CRIME NEWSSTATE NEWSTELANGANA

ములుగు జిల్లాలో మావోయిస్టుల మందు పాత్ర కలకలం

ములుగు జిల్లాలో మావోయిస్టుల మందు పాత్ర కలకలం

భయభ్రాంతులవుతున్న గ్రామస్తులు

వాజేడు జూన్ 14 యువతరం న్యూస్ :

ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల గ్రామానికి చెందిన సుమారు 100 నుండి130 మంది భక్తులు చతిస్గడ్లో లో వెలసిన బేడం లో మల్లన్న స్వామి దర్శనానికి వెళుతుండగా మావోయిస్టుల అమర్చిన మందు పాత్ర పేలి డ ర సునీత 30 సంవత్సరాల మహిళా తీవ్ర ర గాయాల పాలయింది, వెంటనే చుట్టూ ఉన్నవారు హుటాహుటిన వెంకటాపురం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ కి సమాచారం తెలపడంతో కొంతమంది పార్టీ శ్రేణులతో పాటు ఘటన స్థలానికి చేరుకొని బాధితురాలని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు , ప్రధమ చికిత్స నిర్వహించి అనంతరం గాయాలు విషయమంగా అవడంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించినట్టుగా స్థానిక ఎస్ ఐ అశోక్ వెల్లడించారు, ఈ ఘటనతో చొక్కాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి, వాజేడు మండలంలో జగన్నాధపురం గ్రామస్తుడు కొం గా ల అడవి ప్రాంతంలో బాంబుపై కాలు పడడంతో బాంబు పేలి అక్కడికక్కడే మృతి చెందాడు, ఈ ఘటన మరువక ముందే చతిస్గడ్ లో దట్టమైన అటవీ ప్రాంతంలో మరో బాంబు పేలడంతో ఏజెన్సీ వాసులు భయాందోళన చెందుతున్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!