మరణించిన రైతు కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు

మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
మరణించిన ఇల్లెందుల యేసు కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు
వాజేడు జూన్ 5 యువతరం న్యూస్ :
ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం గ్రామ పరిధిలో జాతీయ రహదారి పైన జగన్నాధపురం వై జంక్షన్ నుండి హనుమాన్ సెంటర్ వరకు మరణించిన యేసు ప్లెక్సీ పట్టుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్నాధపురం గ్రామానికి చెందిన ఇల్లెందుల ఏసు (55) కొంగల గ్రామ సమీపంలోని గుట్టలపైన సోమవారం మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలడంతో మృతి చెందిన విషయం విధితమే, ఇల్లెందుల ఏసు మృతికి మందు పాతరే కారణమని అతని బంధువులు నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీ తో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మందు పాతర మూలంగా అమాయకుడు బలి అయ్యాడని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు, మావోయిస్టుల పోరాటం అంటే అమాయకులు, మూగజీవాలు చంపడమే నా? అడవుల్లో స్వేచ్ఛగా తిరిగి హక్కు ఏజెన్సీ వాసులకు లేదా అంటూ మావోయిస్టులకువ్యతిరేకంగా నినాదాలు చేశారు.