నంద్యాల ఎమ్మెల్యే ఎన్ ఎం డి ఫరూక్ కు సన్మానం

నంద్యాల ఎమ్మెల్యే ఎన్ ఎం డి. ఫరుక్ ను, మరియు ఎన్ఎండి ఫిరోజ్ ను సన్మానించిన డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ
నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ ను మరియు యువ నాయకులు ఎన్ ఎం డి ఫిరోజ్ ను డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పుష్పగుచ్చంతో వికలాంగులు అందరూ కలిసి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు,యువ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ……. వికలాంగులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి మాట్లాడుతూ…… జులై నెలలో వికలాంగుల పెన్షన్ గత మూడు నెలల కిందట పెంచిన 9000 మరియు జూలై నెల పెంచిన పెన్షన్ 6000 మొత్తం కలిసి 15, 000 వేల రూపాయలు , పెన్షన్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. పెన్షన్ తో వికలాంగుల అందరూ సంతోషపడుతున్నారన్నారు. ఎమ్మెల్యే దృష్టికి కొన్ని సమస్యలు తీసుకుని వెళ్లడం జరిగినది. ప్రభుత్వం ఏర్పడగానే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో డిజేబుల్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మురహరి రావు, ప్రధాన కార్యదర్శి జహీరుద్దీన్ , డిజేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సభ్యులు కిరణ్ కుమార్, ఎల్లయ్య, నబి రసూల్, ఖాదర్ బాషా, కుమార్, విజయ, సర్దార్, వినోద్, జైలాన్, జమాల్,మనన్, జహీర్, జగదీష్, అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు.