వెంకటాపురంలో మెగా రక్తదాన శిబిరం

వెంకటాపురంలో మెగా రక్తదాన శిబిరం
(యువతరం జనవరి 26) వాజేడు విలేఖరి:
75వ గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని ఏటూర్ నగరం సబ్ డివిజన్ పరిధిలోని వెంకటాపురం పోలీస్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరమును వెంకటాపురంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించడం జరిగినది ఇందులో దాదాపు 200 మంది రక్త దాతలు వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి పాల్గొనడం జరిగినది అదేవిధంగా సిఆర్పిఎఫ్ 39 బెటాలియన్ కమాండో శ్రీ ఆర్ కె పాండా ఆదేశాల మేరకు సి ఆర్ పి ఎఫ్ 39 ఈకంపెనీ డి.ఎస్.పి డాక్టర్ ప్రశాంత్, బీవీ,సిఆర్పిఎఫ్ సిబ్బందితోపాటు రక్తదాన శిబిరంలో పాల్గొని 15 యూనిట్ల రక్తం భద్రాచలం రెడ్ క్రాస్ సొసైటీకి 100 ఎటునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి 50 యూనిట్లు రక్తం ఇప్పించడం జరిగినది అదేవిధంగా ఇట్టి కార్యక్రమంలో సర్కిల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటాపురం శ్రీ బండారి కుమార్ ఎస్సై వెంకటాపురం ఆర్ అశోక్,ఎస్ఐ వాజేడు, సిహెచ్ వెంకటేశ్వర్లు కూడా ఇట్టి రక్తదాన శిబిరం పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన చేయూత ఫౌండేషన్ ఫౌండర్ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ కి రెడ్ క్రాస్ సంస్థ భద్రాచలం వారికి వెంకటాపురం పోలీస్ సర్కిల్ తరఫున బండారి రవికుమార్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.