ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
( యువతరం జనవరి 26) వాజేడు విలేఖరి :
ములుగుజిల్లా వెంకటాపురం మండలం వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం నందు వి ఆర్ కె పురం సర్పంచ్ పునెం శ్రీదేవి చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం సర్పంచ్ శ్రీదేవి మాట్లాడుతూ ముందుగా గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు ప్రముఖ పార్టీ నాయకులకు అందరికీ కూడా 75 వి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోని వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో రచించినట్టుగా నాకు సర్పంచ్ గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను గత గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రజలు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు అందరూ నాకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరి సహకారంతో కొత్తగా ఏర్పడినటువంటి వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ ని అభివృద్ధి చేసుకున్నాము ఇకముందు కూడా అట్లాగే అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో
*ఉప సర్పంచ్ డర్ర శివరాణి,* *అధికార ప్రతినిధి డర్ర దామోదర్,*
*సిపిఐ జిల్లా కార్యదర్శి తోట* *మల్లికార్జున రావు* , పంచాయతీ సెక్రెటరీ ఏ రాజేంద్ర ,
వార్డు సభ్యులు మల్లక్క, అంగన్వాడి టీచర్లు మీనా కుమారి, కుమారి, ఆశ వర్కర్లు లక్ష్మి, రమణ, ముత్యాలు,
ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహారావు, రాజేంద్ర, రవి, రమేష్, గ్రామపంచాయతీ సిబ్బంది బ్రహ్మం, వెంకటేష్, సతీష్,తదితరులు పాల్గొన్నారు