క్లైమ్ అండ్ అభ్యంతరాలను వెంటనే క్లియర్ చేయండి

క్లెయిమ్స్ అండ్ అభ్యంతరాలను వెంటనే క్లియర్ చేయండి
ఈఆర్ఓ, ఏఈఆర్వోలను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
(యువతరం డిసెంబరు 28) నంద్యాల కలెక్టరేట్:
స్వచ్ఛమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించి స్వీకరించిన క్లెయిమ్స్ అండ్ అభ్యంతరాలను వెంటనే క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఈఆర్ఓ, ఏఈఆర్వోలను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులు, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆర్డీవోలు, అన్ని మండలాల తాసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించి పెండింగ్ వున్న ఫారం-6, ఫారం-7, ఫారం-8లో ఉన్న 924 దరఖాస్తులను నాణ్యతతో త్వరితగతిన పరిష్కరించాలని ఈఆర్ఓ, ఏఈఆర్వోలను ఆదేశించారు. అలాగే ఎన్నికల పాపులేషన్ రేషియో, జెండర్ రేషియో, జంక్ క్యారెక్టర్స్,10 కంటే ఎక్కువ ఓట్లు వుండి పెండింగ్ లో ఉన్న అంశాలపై కలెక్టర్ అడిగి తెలుసుకుంటూ ఆలస్యం కావడానికి గల కారణాలపై ప్రశ్నించారు. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం పనికిరాదని… భారత ఎన్నికల సంఘం సూచించిన ఆదేశాలను తప్పక అనుసరిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలో ఓటర్ల సవరణకు సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు ప్రత్యేక తీసుకొని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటింటి సర్వేలో పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఓటర్ల జాబితాలో సవరించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు కృషి చేయాలన్నారు. 18, 19 సంవత్సరాల యువ ఓటర్ల నమోదుపై దృష్టి సారించి నమోదు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.
అన్ని మండలాల్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏపీవోలు, పిఓలు, మైక్రో అబ్జర్వర్లు, మాస్టర్ ట్రైనర్లు, డిస్పాచ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూములు తదితర అంశాలపై ఈఆర్ఓ, ఏఈఆర్వోలను కలెక్టర్ అడిగి తెలుసుకుంటూ పెండింగ్లో ఉన్న అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నంద్యాల, ఆత్మకూరు, డోన్ ఆర్డీవోలు శ్రీనివాసులు, ఎం దాసు, వెంకటరెడ్డి, అన్ని నియోజకవర్గాల ఏఈఆర్వోలు, ఎన్నికల విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు.