28న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ప్రారంభం

28న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ప్రారంభం
తల్లి లక్ష్మీనరసమ్మ జ్ఞాపకార్థం నిర్మించిన తనయుడు తిమ్మారెడ్డి దంపతులు
– రూ. కోటి 20 లక్షలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఈరన్న స్వామి గుడికి విరాళంగా ఇచ్చారు.
పత్తికొండ ఈరన్న స్వామి దేవాలయం పక్కన నిర్మించిన కళ్యాణమండపం
(యువతరం డిసెంబర్ 25) పత్తికొండ ప్రతినిధి:
ఈనెల 28వ తేదీ పత్తికొండ ఆదోని రహదారిలో ఉన్న పత్తికొండ ఈరన్న స్వామి (శ్రీ లక్ష్మీనరసింహస్వామి) దేవాలయం పక్కన నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ప్రారంభిస్తున్నట్లు నిర్మాణ దాత ప్రముఖ కూరగాయల వ్యాపారి తిమ్మారెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా తిమ్మారెడ్డి మాట్లాడుతూ .. తన తల్లి లక్ష్మీ నరసమ్మ శ్రీ వీరన్న (లక్ష్మీనరసింహస్వామి) భక్తురాలు అని అందుకోసమే తన తల్లి పేరు పై ఏదైనా గుడికి నిర్మించాలని సంకల్పించి మొదట చిన్నగా కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అయితే కాలక్రమంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో చిన్నగా నిర్మించిన కళ్యాణ మండపం పూర్తిస్థాయిలో నిర్మించడం జరిగిందన్నారు. ఈనెల 28వ తేదీన గురువారం ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని పత్తికొండకు చెందిన ప్రముఖ పురోహితుడు చెట్టి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. కళ్యాణ మండపం నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరించిన తన తల్లిదండ్రులు సరస్వతమ్మ సుధాకర్ రెడ్డి భార్య హిమబిందు కుమారులు, కుమార్తె ఉష, హర్షవర్ధన్ రెడ్డి, పట్టణవాసులు ఎంతగానో సహకరించడం జరిగిందన్నారు. కావున భక్తాదులు పుర ప్రజలు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేసి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణం పాల్గొని జయప్రదం చేయాలి అన్నారు.