
ప్రణవ్ అనే నేను… హామీ ఇస్తున్నాను…
ఆరు గ్యారెంటీ లపై అమలు చేస్తానని ప్రమాణం..
(యువతరం నవంబర్ 28) ఇల్లంతకుంట విలేఖరి
ప్రణవ్ అనే నేను… హామీ ఇస్తున్న… కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అమలు చేస్తానని మాట ఇస్తున్న అంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ ఇల్లందకుంట శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో బాండ్ పేపర్ పై సంతకం చేశారు. సోమవారం ఇల్లంతకుంట దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన విలేకరుల సమక్షంలో బాండ్ పేపర్ పై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఆరు గ్యారెంటీలు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అందే వరకు నిర్విరామంగా కృషి చేస్తానని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని మండలానికో స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామని, కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రతి మండలంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాలల నిర్మాణం చేపడుతామని తెలిపారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకటేనని, ఆ పార్టీల నాయకుల మోసపూరిత మాటలను ఎవరు నమ్మవద్దని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో…