ANDHRA PRADESHOFFICIAL
ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్

ఆటోడ్రైవర్లకు కౌన్సిలింగ్
(యువతరం నవంబర్ 13) తెనాలి ప్రతినిధి:
సోమవారం తెనాలి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో Ci రమేష్ బాబు ట్రాఫిక్ SI శివరామయ్య లు కలిసి ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ నిబంధనలు వవరిస్తూ వారికి కౌన్సిలింగు ఇచ్చారు.
ఆటోలు నడిపే సమయంలో పాటించవలసిన నియమావళి పాటించవలసిన జాగ్రత్తలు గురించి తెలియజేస్తూ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ,యూనిఫామ్ ధరించాలని, పరిమితికి మించిన ప్యాసింజర్ లను ఎక్కించవద్దని , ఓవర్ స్పీడ్ గా డ్రైవ్ చేయవద్దని, ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ అడ్డంగా ఉండే విధంగా వాహనాలను ఆపరాదని, మద్యం ముట్టరాదని వారికి వివరించారు.