జనసేన_ టిడిపి ఉమ్మడి మేనిఫెస్టో…. కీలక హామీలు, అంశాలు……?????

నేడే జనసేన – టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో.. కీలక హామీలూ, అంశాలూ ఇవే
అమరావతి:2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి చాలా కసరత్తు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రకరకాల పథకాలను ప్రకటిస్తోంది. అంతేకాకుండా జనాల్లోకి రావటానికి “సైకో పోవాలి సైకిల్ రావాలి” అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తోంది…
2024లో విజయకేతనం ఎగరవేయడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలూ ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో లోకేష్ పాదయాత్రతో రంగంలోకి దిగారు. లోకేష్ పాదయాత్ర ఎంతో ప్రజాదరణ పొందింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు అయ్యారు. దాంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. అ క్రమంలో జనసేన – టీడీపీల ఉమ్మడి మేనిఫెస్టోని ఈ రోజు ప్రకటించనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తోంది..
తెలుగుదేశం మేనిఫెస్టో:
అమ్మబడికి బదులుగా తల్లికి వందనం పథకాన్ని తేబోతున్నట్లు తెలిసింది. అమ్మఒడిలో ఒక బిడ్డకు మాత్రమే ప్రయోజనం వర్తిస్తే, తల్లికి వందనం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే, అంత మందికీ చదువు కోసం మనీ ఇస్తామంటోంది టీడీపీ..
వైయస్సార్ చేయూతలో భాగంగా 45 ఏళ్ల వయసు దాటిన మహిళలకు రూ.18,000ను ప్రభుత్వం ఇస్తుండగా.. టిడిపి 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500 ఇస్తానంటోంది. రైతులకు ప్రస్తుతం ప్రభుత్వం ఏడాదికి అందిస్తున్న రూ.12000 స్థానంలో టిడిపి రూ.15000 ఇస్తామని చెప్పింది. దానికి తోడు మహిళలకు ఉచిత బస్సు, ఏడాదికి మూడు సిలిండర్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇంటింటికీ కుళాయిలు, బీసీ రక్షణ చట్టం వంటివి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలిసింది..
టిడిపి – జనసేన 2024 ఎన్నికలకు కలిసి పోటి చేస్తున్నాయి. ఈ తరుణంలో జనసేన మేనిఫెస్టోపై కూడా ఓ స్పష్టత వచ్చింది. ప్రతి ఇంటికి రూ.25లక్షలు బీమా, నియోజకవర్గంలో 5వేల మందికి రూ.10లక్షల ఆర్థిక ప్రోత్సాహం వంటి హామీలు జనసేన దృష్టిలో ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి మేనిఫెస్టో రెడీ చేసినట్లు సమాచారం. పవన్ ప్రతిపాదించే హామీల్లో నిరుద్యోగులు, వైద్యంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన హామీ, రైతులకు పింఛన్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ వంటివి ఉండే అవకాశముంది.