డెంగ్యూ జ్వరాలతో ప్రాణాల్ని వదులుతున్న సోంపల్లి గ్రామ ప్రజలు

డెంగ్యూ జ్వరాలతో ప్రాణాల్ని వదులుతున్న సోంపల్లి గ్రామ ప్రజలు
(యువతరం సెప్టెంబర్ 2) భద్రాద్రి ప్రతినిధి:
బూర్గంపాడు మండలంలో సోంపల్లి గ్రామంలో మూడు నెలల నుండి డెంగ్యూ మలేరియా విషజరాలతో ప్రజలు తల్లడిల్లుతున్నారని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
పండగ నాగేంద్రబాబుకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు.
28 సంవత్సరాలు వయసు అతనికి మూడు సంవత్సరాల పాప మళ్లీ అతని భార్య ఐదు నెలలు గర్భిణీ ఆమె పేరు అలీయమ్మ ఆ గ్రామంలో గతంలో జులై నెల 31న పొందు లక్ష్మయ్య డెంగ్యూ జ్వరంతో చనిపోవడం జరిగింది.
ఇప్పుడు పండగ నాగేంద్రబాబు ఐదు రోజుల నుంచి జ్వరం వస్తుందని పాల్వంచ ప్రభుత్వం హాస్పటల్ చూపించుకున్నాడు అయినా బతకలేదు .ఆ గ్రామాన్ని ఇంత మట్టికి గౌరవనీయులైన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగ కాంతారావు
ఆ ప్రాంతాన్నికె ఎల్లలేదు ఆ గ్రామం ప్రజలు జరాలతో తల్లడిల్లుతున్నారు . అయినా ఎమ్మెల్యే ఇంత మటుకు వెళ్ళలేదు ఇంత దారుణమా అధికారులు ప్రతినిధులు
ప్రజల్ని పట్టించుకునేది ఎవరు ఓట్లు కోసమేన ప్రజలు బతకాల్సింది ఆ ప్రజలకి నిరంతరం ప్రజాసేవ చేసే బాధ్యత ప్రజాప్రతినిధులకు అధికారులకు లేదా కానీ ఆ ప్రాంతంలో చాలా భయంకరంగా మలేరియా జరాలు డెంగ్యూ చుట్టుముట్టింది గ్రామాన్ని మళ్లీ ఆ ప్రాంతాన్ని వెల్త్ క్యాంపులు పెట్టి మళ్ళీ
ఆ ప్రాంతం అంత కూడా జల్లెడ పట్టాల్సిన అవసరం ఉంది. డాక్టర్ల పైన అధికారుల పైన ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఆ గ్రామాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ డెంగ్యూ జ్వరంతో హాస్పటల్ చూపించుకొని పనికి పోయే పరిస్థితి లేదు ఒళ్ళునొప్పులు కీళ్ల నొప్పులు తలనొప్పి ఇలాంటివి ఇబ్బందులకు గురవుతున్నారు సోంపల్లి గ్రామ ప్రజల.అందుకోసం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీలు రైసు పదివేల రూపాయలు ఆ కుటుంబాలకు ఇవ్వాలి. అదే రకంగా డెంగ్యూ జ్వరం తో చనిపోయిన కుటుంబాలకి పది లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం ఉంది.
చిన్న వయసులోనే పండుగ నాగేంద్రబాబు చనిపోయాడు. అదే రకంగా లక్ష్మయ్య అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది.
ఈ రెండుకుటుంబాలకి ప్రభుత్వం నుంచి
ఆ కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలని
సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది .
ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి నిమ్మల అప్పారావు సాయి నాగేంద్రబాబు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.