
అరుదైన వింత పాము దర్శనం
రెండు తలలతో వున్నపాము ను అడవిలో విడిచి పెట్టిన ఫారెస్టు అధికారులు
(యువతరం సెప్టెంబర్ 2) భద్రాద్రి ప్రతినిధి:
చర్ల మండలం గొంపల్లి పంచాయతీ పరిధిలో ఓ వింతపాము దర్శనమిచ్చింది.అది గమనించిన దండురి శ్రీను అనే వ్యక్తి చూసి గ్రామస్తులను పిలిచి ఆ వింత రెండు తలలు గల పాముని పటుకొని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా, ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ ఉపేంద్రా అదేశానూసారం ఫారెస్ట్ ఆఫీసర్లు శనివారం ఉదయం 9:30 సమయంలో గొంపల్లీ వచ్చి పామును స్వాధీనం చేసుకొని సుబ్బంపేటా అటవీ ప్రాంతం లో వదిలిపెట్టారు.