
వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
(యువతరం సెప్టెంబర్ 2) భద్రాద్రి ప్రతినిధి:
అశ్వాపురం మండలంలోని ఆరిఫ రోష్ని వృద్ధాశ్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, మహానేత స్వర్గీయ డాక్టర్.వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అరటి పండ్లు అందించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
గౌరవనీయులు స్వర్గీయ డాక్టర్.వైయస్ రాజశేఖర్ రెడ్డి దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న మహా నాయకులని అన్నారు.
ఆయన మరణం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు తెలుగు ప్రజలందరికీ తీరని లోటు అన్నారు.
వైయస్సార్ భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు.ఇందిరమ్మ తర్వాత పేద ప్రజలకు అంతటి సంక్షేమ పథకాలు అందించిన మహానేత రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.