
సంక్షేమ పథకాలు అంటే గుర్తుకు వచ్చేది రాజశేఖర్ రెడ్డి
– కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నిర్వహణ
(యువతరం సెప్టెంబర్ 2) భద్రాద్రి ప్రతినిధి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా పినపాక మండల కేంద్రంలోని బయ్యారం గ్రామంలో ఉన్నటువంటి వైయస్సార్ విగ్రహం వద్ద రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు
పోలెబోయిన శ్రీవాణి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అంటే గుర్తుకొచ్చేది రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు గూడునిచ్చి , ఫించనుతో వారికి ఆకలి తీర్చారన్నారు. ఆరోగ్యశ్రీతో ఎందరికో పునర్జమ్మ అందించారని ప్రజల హితం కోరిన వైఎస్ రాజశేఖరరెడ్డి మహానేత అయ్యారన్నారు. చెదరని చిరునవ్వుతో ప్రతి పేదవాడిని పలకరించే రాజన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలను శోక సంద్రంలో ముంచుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి 14 ఏళ్ళు గడిచిపోయాయన్నారు. మహానేత మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటు అన్నారు.
ఈ కార్యక్రమంలో
మాలపాటి వేంకటేశ్వర రెడ్డి,గుంటక చిన్ననారాయణ రెడ్డి, మారం రెడ్డి నారాయణ రెడ్డి, దేవిరెడ్డి వేంకటేశ్వర రెడ్డి,ముక్కు వెంకట రెడ్డి, సానికొమ్ము నాగిరెడ్డి,గంగిరెడ్డి బ్రదర్స్, గట్ల శ్రీనివాస్ రెడ్డి,ముక్కు వేంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.