ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALWORLD
ఇండిగో విమానంలో ఇస్రో చీఫ్

ఇండిగో విమానంం లో ఇస్రో ఛీఫ్
యువతరం సెప్టెంబర్ 1
ఇస్రో చీఫ్ సోమ్ నాథ్ ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఆయన తమ విమానంలో ప్రయాణిస్తుండడాన్ని ఇండిగో వర్గాలు ఎంతో అపురూపంగా భావించాయి. ఈ నేపథ్యంలో, విమానం గాల్లోకి లేచే ముందు ప్రత్యేక అనౌన్స్ మెంట్ తో ఆయనను గౌరవించాయి. ‘
ఇవాళ ఈ విమానంలో మనందరితో పాటు ఓ విశిష్ట వ్యక్తి కూడా ఉన్నారు. మీరు (సోమ్ నాథ్) ఈ విమానంలో ఉన్నందుకు ఇండిగో ఎంతో సంతోషిస్తోంది. మీకు సేవలు అందించే అవకాశం లభించడాన్ని మాకు మహాభాగ్యంగా భావిస్తున్నాం. దేశం గర్వించేలా చేసిన మీకు ధన్యవాదాలు’ అంటూ గౌరవ వచనాలు పలికారు. ఈ సందర్భంగా విమానం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది. అనంతరం సోమ్ నాథ్ కు ఎయిర్ హోస్టెస్ ఫుడ్ ట్రే ఇస్తూ, ఇండిగో తరఫున ఓ గ్రీటింగ్ కార్డును కూడా అందించింది.