ANDHRA PRADESHEDUCATIONJOURNALIST

ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలి

ఏపీయూడబ్ల్యూజే

ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలి

– జేసీ మౌర్య కు వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజే నేతలు

(యువతరం సెప్టెంబర్ 01) కర్నూలు ప్రతినిధి:

జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలని ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కొండప్ప, కే.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ సలహాదారులు కృష్ణా రెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ.ఎన్.రాజు, కే.శ్రీనివాస్ గౌడ్, హెచ్ఎంటీవీ స్టాఫ్ రిపోర్టర్ హరి కిషన్, జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి కోరారు. శుక్ర వారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లా ఇంచార్జీ కలెక్టర్ నారపరెడ్డి మౌర్యను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో నాలుగవ పిల్లర్ గా మీడియా ఉందన్నారు. ఈ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు చాలీ, చాలని వేతనాలతో పని చేస్తున్నారన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సమాజం పట్ల ఉన్న సామాజిక దృక్పథం తో సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, మూఢనమ్మకాలు, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు, సామాజిక రుగ్మతలు తదితర ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకురావడం లో జర్నలిస్టులు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా మొక్కవోని దైర్యం తో సమాజం పట్ల బాధ్యత తో ముందుకు వెళుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు మంచి విద్యను కూడా అందించలేక పోతున్నారన్నారు. జర్నలిస్టుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో పని చేసిన కలెక్టర్లు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో మొత్తం ఫీజులో 60 శాతం రాయితీ ఇస్తూ ఆదేశాలు ఇచ్చారన్నారు. గత కొన్నేళ్లుగా ఈ రాయితీ అమలవుతూ వస్తోందన్నారు. అయితే ఈ ఏడాది ఈ రాయితీ ఇచ్చేందుకు కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ నిరాకరిస్తున్నాయని జేసీ దృష్టికి తీసుకెళ్లారు. మరో పక్క అనంతపురం, శ్రీ సత్య సాయి, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో ఉచిత విద్య అందించాలని ఆదేశిస్తూ అయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారన్నారు. కనుక కర్నూలు జిల్లాలో కూడా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో ఉచిత విద్య అందించాలని కోరారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!