
ఎన్ ఎస్ యు ఐ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా జమ్మికుంట మహమ్మద్ ఇమ్రాన్ భాయ్
(యువతరం సెప్టెంబర్ 1) జమ్మికుంట విలేఖరి:
ఎన్ ఎస్ యు ఐ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ ఇమ్రాన్ భాయ్ ని నియమిస్తూ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బలుమూరు వెంకట్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ఇన్ని రోజులు కరీంనగర్ జిల్లా ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శిగా మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క సూచనలు మరియు కర్తవ్యాలను తుచా తప్పకుండా మరియు విద్యార్థులకు ప్రజలతో మమ్మీకమై ఎనలేని సేవలు అందించినందుకు నన్ను గుర్తించి ఇలాంటి ఉన్నత పదవిని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా నాకు ఇచ్చిన గౌరవ ఉపాధ్యక్ష పదవిని విద్యార్థుల కోసము మరియు ప్రజల కోసము అనునిత్యం కృషి చేస్తానని ఈ నియామకానికి కృషి చేసిన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ గారికి, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ థామస్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్యపు జీవన్, రితీష్ రావు మరియు నా తోటి ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకంలో జిల్లా ఉపాధ్యక్షునిగా మొహమ్మద్ ఇమ్రాన్, ప్రధాన కార్యదర్శులుగా దేశరాజు అనిల్, లింగంపల్లి శ్రీకాంత్, గాలేము నరేష్, ప్రణీత నాంపల్లి నల్లాల అఖిల్ ,బసవేణి తెజాస్ ,జీ మహేష్, జిల్లా కార్యదర్శులుగా ఎం.డి పర్విస్ ,పల్నాటి అభిలాష్ ,ఎం.డి అస్మత్, పల్లె వెంకటరమణారెడ్డి, కొయ్యడ విజయ్, భజన సందీప్ లు నియమింపబడ్డారు.