కీర్తిశేషులు కుసుమ జగదీష్ 47వ జయంతి వేడుకలను జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలి

కీర్తిశేషులు కుసుమ జగదీష్ 47 వ జయంతి వేడుకలను జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలి….
ములుగు బి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్.
(యువతరం ఆగస్టు 19) ములుగు ప్రతినిధి.
ములుగు జిల్లా : 20-08-2023 ఆదివారం రోజున ములుగు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దివంగత కుసుమ జగదీష్ ప్రధమ జయంతి పురస్కరించుకొని జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో జయంతి వేడుకలను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ప్రజాప్రతినిధులకు, ఉద్యమకారులకు, పార్టీ మరియు జగదీష్ అన్న అభిమానులకు, కళాకారులకు బాదం ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ మలి దశ ఉద్యమం నుండి చివరి శ్వాస వరకు తెలంగాణ సాధన మరియు టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అభివృద్ధిలో నిరంతరం కృషి చేసిన వ్యక్తి కుసుమ జగదీష్ వారి సేవలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు రేపు అన్ని మండల గ్రామ కేంద్రాలలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని తద్వారా కుసుమ జగదీష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరే విధంగా అన్నగారి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే విధంగా ప్రతి కార్యకర్త కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందుండాలని బాదం ప్రవీణ్ ఆకాంక్షించారు.