
కూనవరం గ్రామంలో సుమారు 50 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న అల్లూరి సీతారామరాజు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
(యువతరం ఆగస్టు 19) భద్రాద్రి ప్రతినిధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని కూనవరం గ్రామంలో సుమారు 50 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో ఎస్ డి ఎఫ్ నిధులతో నిర్మించనున్న అల్లూరి సీతారామరాజు కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సామాజిక వర్గాలకు స్థలాలు కేటాయించిన సీఎం కేసీఆర్ ఎంతో ఆదర్శప్రాయుల అన్నారు, సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మాణానికి తన నియోజకవర్గంలో అమలు చేసేందుకు విప్లమాత్మకంగా అడుగులు వేస్తున్నాను అన్నారు. మణుగూరులో అన్ని కులాల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇప్పటికే నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారు గ్రామీణ ప్రాంతాలలో కుల సంఘాల భవనాల నిర్మాణంతోపాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినందుకు చర్యలు చేపడుతున్నామన్నారు అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది అన్నారు.