ఎమ్మిగనూరులో మహాశక్తి కార్యక్రమం

ఎమ్మిగనూరులో మహాశక్తి కార్యక్రమం
(యువతరం ఆగస్టు9) ఎమ్మిగనూరు ప్రతినిధి;
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కర్నూలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు ముంతాజ్ ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలకులు శ్రీరాములుతో కలిసి బుధవారం సర్వమత పూజలు, ప్రార్థనలు అనంతరం ఎమ్మిగనూరు పట్టణంలోని తేరుబజారు యందు మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలను ఉద్దేశించి బీవీ జయనగేశ్వరరెడ్డి ప్రసంగిస్తూ టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల మహానాడు వేదికగా మహిళలకు లబ్ది చేకూరే విధంగా తల్లికి వందనం ( ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉన్న వారికి ఒక్కొక్కరికి ఏడాదికి రూ 15వేలు , ఆడబిడ్డ నిధి ( 18 సంవత్సరాలు నిండి ప్రతి స్త్రీ కి నెలకు రూ 1500లు, దీపం పేరుతొ ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి బృహత్తర కార్యక్రమాలను గురించి మహిళలకు క్షుణ్ణంగా వివరించారు.