విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

విద్యా వ్యవస్థ ను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల ఉద్యమాల ద్వారా నే బుద్ధి చెప్తాం
టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం
(యువతరం ఆగస్టు 9) కర్నూలు ప్రతినిధి;
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ, బి టి నాయుడు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముందుగా స్వర్గీయ తారకరామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిటి నాయుడు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందని, వేలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారాన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా, కనీస సౌకర్యాలు కరవు అయ్యాయని అన్నారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామాంజినేయులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా వ్యతిరేక నిర్ణయాల మీద ఇప్పటికే టీఎన్ఎస్ఎఫ్ ఎన్నో పోరాటలు చేసిందని, ఇకపై కూడా ప్రతి విద్యార్ధి సమస్య మీద పోరాటం కొనసాగిస్తూనే ముందుకు వెళ్తామన్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పలు విద్యార్థి సమస్యలకు సంబంధించి రామాంజినేయులు తీర్మానం ప్రవేశపెట్టగా వాటిని టీడీపీ అధ్యక్షులు బిటి నాయుడు ఆమోదం తెలిపారు. అనంతరం బిటి నాయుడుని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పూలమాల, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కర్నూలు పార్లిమెంట్ మరియు రాష్ట్ర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.