నా భూమి నా దేశం కార్యక్రమం

నా భూమి నా దేశం కార్యక్రమం
(యువతరం ఆగస్టు 9) అమడగూరు విలేఖరి;
మండల పరిధిలోని
చీకిరేవులపల్లి గ్రామ పంచాయతీ లోని జూనియర్ కాలేజీ సీతిరెడ్డిపల్లి నందు, గుండువారిపల్లి గ్రామపంచాయతీ లోని కేజిబివి స్కూల్ మరియు మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ లోని జడ్పీహెచ్ హై స్కూల్ నందు నా భూమి నా దేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే గుండు వారి పల్లెలో
శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి దేశానికి అంకితం ఇవ్వడం జరిగింది. అనంతరం చీకిరేవులపల్లి గ్రామపంచాయతీ లో జూనియర్ కాలేజీ ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది, అలాగే గుండు వారి పల్లి దగ్గరలో ఉన్న కేజీబీవీ పాఠశాల నందు నా భూమి నా దేశం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటడం జరిగింది.
మేరీ మాటి మేరా దేశ్ పంచ ప్రాణ్ ప్రతిజ్ఞ
వసుధకు వందనం చెట్లు నాటడం
వీరులకు వందన సమర్పణ మట్టి దీపాలతో
జెండా ఎగుర వేయడం మరియు వందన సమర్పణ.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మునెప్ప, గ్రామ పంచాయితీ సెక్రెటరీ భరత్ కుమార్ రెడ్డి, ఎస్ ఓ వెంకట రమణమ్మ, వెల్ఫేర్ అసిస్టెంట్ వేణుగోపాల్ రెడ్డి , డిసి ఆనంద్ ఫీల్డ్ అసిస్టెంట్లు వెంకట శివ, అప్పల, సర్పంచ్ మోహన్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, కాలేజ్ లెక్చరర్స్, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులు సచివాలయ సిబ్బంది ,ఉపాధి హామీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.