యువత పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వీడాలి

యువత పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యధోరణి వీడాలి
– దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి
(యువతరం ఆగస్టు09) మద్దికేర విలేఖరి;
యువత పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
నిర్లక్ష్యధోరణి అవలంభిస్తుందని వచ్చే ఎన్నికల్లో యువత ఓటుతో బుద్ధి చెప్పాలని సీనియర్
రాజకీయ నాయకుడు, జై రాయలసీమ పర్యవేక్షణ సమితి పార్టీ అధినేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు
మద్దికెరకు బుధవారం జీపుజాతా కార్యక్రమం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని, అలాంటి యువతకు ఉద్యోగ, ఉపాధి
అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. రాయలసీమ
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అటకెక్కాయన్నారు. రైతులకు సాగునీటిని అందించలేని పరిస్థితి
దాపురించిందన్నారు. దీంతో ప్రజలు, రైతులు, నిరుద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై
ఆగ్రహంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పి గద్దె దించాలని పిలుపునిచ్చారు.
తమ పార్టీని గెలిపిస్తే అభివృద్ధికి బాటలు వేస్తామని హామీ ఇచ్చారు. ఈయన వెంట పార్టీ
నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.