తెలుగుదేశంలో బయటపడుతున్న విభేదాలు

తెలుగు దేశంలో బయటపడుతున్న విభేదాలు
(యువతరం) వెల్దుర్తి విలేఖరి;
ఇటీవల తెలుగుదేశం నిర్వహిస్తున్న వరుస కార్యక్రమాలు తెలుగుదేశం విభేదాలను బయటపెడుతున్నాయి. ముఖ్యంగా దేశం పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహిస్తే, మరుసటి రోజు మరో వర్గం అదే కార్యక్రమాన్ని నిర్వహించడం గమనర్హం. దీంతో పార్టీలో విభేదాలు ఉన్నట్లు చెప్పకనే చెబుతున్నాయి. వర్గ విభేదాలపై మండలంలో తెలుగుదేశం అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ నాయకత్వం వెల్దుర్తి మండల తెలుగుదేశం పై దృష్టి సారించాలని తెలుగుదేశం అభిమానులు కోరుతున్నారు. మండలంలో వర్గ విభేదాలు అరికట్టి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని మండల తెలుగుదేశం అభిమానులు కోరుతున్నారు. రాబోయే కాలంలో వర్గ విభేదాలతో పార్టీ తీవ్రంగా నష్టపోయి అవకాశం ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. పార్టీకి నష్టం కలగకుండా త్వరగా విభేదాలని లేకుండా చూడాలని తెదేపా అభిమానులు కోరుతున్నారు.