ANDHRA PRADESHCRIME NEWS
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
(యువతరం ) వెల్దుర్తి విలేఖరి;
వెల్దుర్తి జాతీయ రహదారి 44 పై సోమవారం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సర్దార్ జి డాబా ఎదురుగా ప్యాపీలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉద్యోగి సుధీర్ ప్యాపిలి నుండి కర్నూలుకు కారులో ప్రయాణం చేస్తున్నాడు. మార్గమధ్యంలో ఏపీ 39 జెబి 5551 హోండా కారు అతివేగంగా డివైడర్ ఎక్కించగా టైర్ పగిలి మూడు పల్టీలు కొడుతూ హైవే పక్కన పడటం జరిగింది. కారు నడుపుతున్న సుధీర్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కున్నాడు. సమాచారం అందుకున్న వెల్దుర్తి సీఐ యుగంధర్, ఎస్ఐ చంద్ర శేఖర్ రెడ్డి సిబ్బందితో హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో బయటికి లాగి 108 ద్వారా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు.