ANDHRA PRADESHSOCIAL SERVICE

అభివృద్ధికి అడ్డంకులా

అభివృద్ధికి అడ్డంకులా ?

కమిషనర్ పై చర్యలు తీసుకోవలనుకోవడం అమానుషం

కార్పొరేటర్లు కమిషనర్ పై దాడి ఎందుకు

నగర అభివృద్ధిని ఆటంక పరచవద్దు

రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి

(యువతరం జూలై 31) కడప ప్రతినిధి;

దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని వెనకబడిఉన్న కడప నగరాన్ని ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ రావడంతో ఈరోజు కడప నగరమంతా ఎంతో సుందరీ కారణంగా మారటానికి కమిషనర్నే కారణం. అభివృద్ధి చేస్తున్న అధికారులపై బురద చల్లడం మానుకోవాలని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి సోమవారం తన కార్యాలయంలో అన్నారు.
అభివృద్ధి అంటే అధికారులపై దాడి చేయడం కాదని, గాడి తప్పిన పరిపాలనను నిద్రపోతున్న సంబంధిత అధికారులను లేపి పనిచేయడం పాలనను గాడిలో పెట్టడం కార్పొరేటర్లకు తప్పుగా అనిపిస్తుందా అని ఆయన ప్రశ్నించారు.
ఏళ్లకు ఏళ్లుగా చేయలేని పనులను, రోడ్ల వెడల్పు, సక్రమమైన డ్రైనేజీ పారుదల, నగరంలో ఎక్కడ చెత్త నిలువలు లేకుండా చూడడం, సమస్యలపై కమిషనర్ గడప తొక్కిన వారి సమస్యను వెంటనే పరిష్కరించడం, తెల్లవారకముందే ప్రజల సమస్యలు తెలుసుకునుటకు ప్రాంతాలలో పర్యటనలు మొదలైన కార్యక్రమాల ద్వారా కడప నగర ప్రజలకు సుపరిపాలన అందించారని అలాంటి వారిని కడప నుండి పంపించేయాలని చూడడం దుర్మార్గమైన ఆలోచనని ఆయన తప్పు పట్టారు. ఇలాంటివారు భవిష్యత్తులో ఇదే ప్రాంతానికి కలెక్టర్ అయితే జిల్లా అంత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్పొరేటర్లు నిజంగానే ప్రశ్నించాలి అనుకుంటే ఆ నలుగురిని ప్రశ్నించాలని, వారిని నిలదీయాలని వారిని మార్చాలని ఇవేవీ చేయలేక, చేతకాక సమర్థవంతమైన పాలనను అందిస్తున్న అధికారులు పోగొట్టుకోవడం అంధకారంలో జీవించడమే అవుతుందని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సిద్ధరామయ్య నగర కార్యదర్శి మక్బుల్ భాష నగర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!