ఘనంగా శ్రీ చౌడేశ్వరి గ్రామైక్య సంఘం వార్షికోత్సవం

ఘనంగా శ్రీ చౌడేశ్వరి గ్రామైక్య సంఘం వార్షికోత్సవo
ఆమడగురు యువతరం విలేఖరి;
ఆమడగూరు మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ కాలనీలోని కమిటీ హాల్ కార్యాలయం లో గురువారం గ్రామ సంఘం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.తొలుత గ్రామ సంఘం ఆదాయం, ఖర్చు లాభనష్టాలు,వివరాలపై సభ్యురాలు చర్చించారు.ఈ కార్యక్రమానికి సిసి రత్నమయ్యహాజరై మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలని ఉద్దేశంతో గ్రామ సంఘాలను స్థాపించిందని తెలిపారు. మండలంలో గ్రామైక్య సంఘాల ద్వారా మహిళలు తమ కాళ్ళ మీద నిలబడి పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలని ఉద్దేశంతో మహిళల మహిళా సంఘాలు ఏర్పాటు చేశారు అన్నారు. అనంతరం సంఘాల వారీగా లాభనష్టాలను ప్రొజెక్టర్ ద్వారా మహిళా సంఘాల అభివృద్ధిపై డిస్ప్లే చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిసి రత్నమయ్య అని మీటర్లు సి,మల్లికార్జున,వివో లీడర్లు, మహిళా సంఘాల,సభ్యులు వెలుగు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.