మిషన్ రాయలసీమ పోస్టర్లు ఆవిష్కరణ

మిషన్ రాయలసీమ పోస్టర్లు ఆవిష్కరణ
డోన్ యువతరం ప్రతినిధి;
టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ బాబు తలపెట్టిన మిషన్ రాయలసీమ పోస్టర్లను డోన్ నియోజకవర్గ ఇంచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి సమక్షంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్, చినబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగు యువత ఉపాద్యక్షులు తమ్మినేని రాజశేఖర్ నాయుడు, డోన్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కుమ్మరి సుధాకర్ ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి సీమను అభివృద్ధి బాట పట్టించేందుకు హామీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రణాళిక ప్రకారం ఏం చేస్తామో చెప్తూ యువగళం పాదయాత్రలో భాగంగా యువ నాయకుడు నారా లోకేష్ హామీ ఇచ్చిన మిషన్ రాయలసీమ హామీ కరపత్రాలను తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మిషన్ రాయలసీమ భవిష్యత్తుకు భరోసా అని నారా లోకేష్ కడపలో జరిగిన రాయలసీమ డిక్లరేషన్ ను వివరించారు.యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారికి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర అభివృద్ధి గురించి వివరించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు..
ఈ కార్యక్రమంలో డోన్ టీడీపీ పట్టణ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు ,రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిది శ్రీనివాసులు , జిల్లా కార్యదర్శి అభిరెడ్డిపల్లి గోవింద్, సీనియర్ టీడీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి, డోన్ నియోజకవర్గ ప్రదాన కార్యదర్శి వంశీ ,డోన్ మండల అధ్యక్షులు కోనేటి కాసి,ఉపాధ్యక్షులు సాగర్,పట్టణ ప్రదాన కార్యదర్శి కేబుల్ కిరణ్,కార్యదర్శులు యర్రిస్వామి గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి
,తిమ్మాపురం సుధాకర్, గుండాల జగన్ మరియు తెలుగు యువత నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…