సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతో సాధ్యం

సంక్షేమం, అభివృద్ధి తెదేపాతో సాధ్యం
కొత్తపల్లి యువతరం విలేఖరి;
సంక్షేమం అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని నంద్యాల పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు మాండ్రా శివానందరెడ్డి అన్నారు. శుక్రవారం తెదేపా నాయకుల ఆధ్వర్యంలో గువ్వలకుంట్ల గ్రామంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు మహానాడు లో ప్రకటించిన మెనిఫెస్టోలో యువతకు,మహిళలకు రైతులకు ప్రధాన్యత ఇస్తూ నిరుద్యోగ యువతకు రూ 3వేల భృతి 20 లక్షల ఉద్యోగాలు, రైతులకు సాగుకోసం రూ.20వేలు, మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు, ఆర్టీసీ ప్రయాణం వంటి మహాశక్తియువగళం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీల రక్షణ చట్టం వంటి పథకాలు అందజేస్తుందన్నారు. తెదేపా మెనిఫేస్టోతో వైకాపాకు భయం మొదలైందన్నారు రాబోవు ఎన్నికల్లో తెదేపా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెదేపా నాయకుడు మల్లారెడ్డి ఆధ్వర్యంలో దుద్యాల గ్రామానికి చెంది 10 మంది ఇతర పార్టీలనుంచి తెదేపాలో చేరారు ఈ కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గం నాయకుడు జయసూర్య తెదేపా మండల అధ్యక్షుడు జెడ్ వెంకట్ రెడ్డి, తెదేపా నాయకులు లింగస్వామిగౌడ్,మోహన్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.