ములుగు జిల్లాలో వెంటనే గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభించాలి

ములుగు జిల్లాలో వెంటనే గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభించాలి
కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్
ములుగు యువతరం ప్రతినిధి;
జిల్లా కేంద్రంలో ములుగు మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ విచ్చేసి ములుగు జిల్లాలో వెంటనే గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభించాలని, లేకపోతే రేపు హన్మకొండలో జరిగే మోడీ సభను అడ్డగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, మత్స్య శాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లెల్ల భరత్ కుమార్, ఆకుతోట చంద్రమౌళి, గోవిందరావుపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి – అనిల్ యాదవ్, ములుగు పట్టణ అధ్యక్షులు చింతనిప్పుల బిక్షపతి, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు షకీల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగరాజు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు ఆలోత్ దేవ్ సింగ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి శంకరయ్య, మైనారిటీ జిల్లా నాయకులు శర్బుద్ధిన్, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ జక్కుల రేవంత్ యాదవ్, నియోజకవర్గ యూత్ అధికార ప్రతినిధి అంగోత్ వంశీకృష్ణ, సింగిల్ విండో డైరెక్టర్ బోయిని రాజు, మండల ఉపాధ్యక్షులు హర్షం రఘు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు, సర్పంచ్ భద్రయ్య, ఎస్.సి.సెల్ జిల్లా నాయకులు బొడ రఘు,నాయకులు వోరుగంటి కృష్ణ, సతీష్, అనిల్, రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.