ఫుడ్ కమిషనర్ ను సత్కరించిన బిజెపి నాయకులు

ఫుడ్ కమిషనర్ ను సత్కరించిన బిజెపి నాయకులు
డోన్ యువతరం ప్రతినిధి;
వృత్తి రీత్య సాధారణ తనిఖీలలో భాగంగా డోన్ మండల అంగన్వాడి సెంటర్లు, పాఠశాలల, వసతి గృహాలలో అందజేస్తున్న ఆహారం నాణ్యతను తనిఖీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి శుక్రవారం రావడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అలాగే పట్టణంలోని ప్రతి నెల రేషన్ బియ్యం మొబైల్ వ్యాను ద్వారా అందించే బియ్యం లబ్ది దారులకు సరిగ్గా అందడం లేదని ప్రజలు తీవ్ర ఇబ్బందుల కు గురవుతున్నారని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మీ రామయ్య, ఓబీసీమోర్చా జిల్లా ఉపాధ్యక్షడు బోయ బాలకృష్ణ, ఓబీసీమోర్చా జిల్లా కార్యదర్శి కోడి ఆశోక్ కుమార్, నంద్యాల శ్రీను జిల్లా నాయకులు, సోషియల్ మీడియా అప్ప ఆశోక్ కుమార్, తదితరులు పాల్గొనడం జరిగినది.