ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల బోర్డును ఏర్పాటు చేయాలి

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల బోర్డును ఏర్పాటు చేయాలి
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజులు నియంత్రణ చట్టాన్ని అమలు చేయడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలం చెందారని, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంలు నాడు నేడు, జగనన్న విద్యా దీవెనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మహేంద్ర బాబు,నరసన్న విరేష్ యాదవ్, ఆఫ్రిది రఘునాథ్ ,రామకృష్ణ , ప్రభుత్వ ఎంపీపీ హాల్లో ప్రవేట్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమావేశాన్ని శుక్రవారం అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, ఫీజుల బోర్డును ఏర్పాటు చేయడం లేదని, నిబంధనలే పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎంఈఓలు ఆంజనేయులు, మధుసూదన్ రాజుకు ప్రవేట్ పాఠశాలలపై తనకిలు నిర్వహించి, వారం వారం తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ప్రవేట్ పాఠశాల పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, ప్రభుత్వం నిర్ణయించిన విధి విధానాలు అమలు చేయాలని నేను పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.