పాఠశాలకు సిసి రోడ్డు నిర్మించాలి

పాఠశాల కు సిసి రోడ్డు నిర్మించాలి
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం
కొత్తపల్లి యువతరం విలేఖరి;
మండలంలోని ఎర్రమఠం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాలంటే బురద ఉండడంవల్ల పాఠశాల విద్యార్థులు, అంగన్వాడి పిల్లలు, గర్భిణీలు, బాలింతలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పాఠశాల వరకు సిసి రోడ్డు నిర్మించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు బొల్లు ప్రసాద్ బాబు యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు ఎర్రమటం పాఠశాల ముందున్న రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్రమఠం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో నే అంగన్వాడీ సెంటర్ నిర్వహిస్తున్నారన్నారు. 105 మంది విద్యార్థులతో పాటు అంగన్వాడీ పిల్లలు, గర్భిణీలు, బాలింతలు బురద రోడ్డుతో వర్షాకాలం వచ్చిందంటే నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వానికి గాని పాలకులకు గాని విద్యార్థుల సమస్యలు పట్టడం లేదు అని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులకు సిసి రోడ్డును మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.