గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న బిఆర్ఎస్

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం యువతరం ప్రతినిధి;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మెయిన్ రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైన్స్ సెంట్రల్ లైటింగ్ కోసం సుమారు 4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పరిశీలించడం జరిగింది. అక్కడ జరుగుతున్న పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని మౌలిక సదుపాయాలు కావలసిన నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నమన్నారు గతంలో ఎవరు చేయని విధంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టి సంక్షేమ పథకాలతో అనతి కాలంలోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది అన్నారు.