ANDHRA PRADESHDEVELOPPOLITICS
51 వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేకే రాజు
విశాఖలో అభివృద్ధి పనులు

51వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కె.కె రాజు
విశాఖ యువతరం ప్రతినిధి;
విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వార్డులో మాధవధార వుడా క్వార్టర్స్ వద్ద రూ20లక్షల రూపాయల వ్యయంతో డ్రైన్లు,రోడ్డులు నిర్మాణం మరియు రూ20లక్షల రూపాయల వ్యయంతో మహాత్మ కాలనీ లో డ్రైన్లు కల్వర్టులు పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం 51వార్డు కార్పొరేటర్ రేయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో డి ఈ భరణి, 51వార్డ్ నాయకులు తిరుమలరావు,రత్నం, వరలక్ష్మి,ధర్మవతి,రాజేశ్వర రావు,శ్యామ్, గణేష్,రాణి,వినోద్, ధర్మేంద్ర,త్రినాధ్,రమణ,ఏళ్ళజి మరియు గ్రామ పెద్దలు, సచివాలయం సిబ్బంది, వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.