లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాలు మరియు అన్నదాన వితరణ పరిసరాలు ఆకస్మికతనికి
ఈవో లవన్న

లడ్డు ప్రసాద విక్రయకేంద్రాలు మరియు అన్నప్రసాద వితరణ ఆకస్మిక తనిఖీ
శ్రీశైలం యువతరం ప్రతినిధి;
శ్రీశైలం ఆలయ కార్యనిర్వహణాధికారి లవన్న బుధవారం లడ్డు ప్రసాద విక్రయకేంద్రాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా లడ్డుప్రసాదాల విక్రయకేంద్రాలలో స్టాకు నమోదు, లడ్డు ప్రసాదాల టికెట్ల జాతీ విధానము మొదలైన అంశాలను పరిశీలించారు.
అదేవిధంగా ఆయా కౌంటర్లలోని అమ్మకాలను నగదుతో సరిపోల్చి చూశారు. అలాగే పలు కౌంటర్లలో లడ్డూ ప్రసాద బరువును కూడా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ భక్తులు అధికసమయం క్యూలైన్లలో వేచివుండకుండా త్వరితంగా ప్రసాదాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని విక్రయకేంద్ర పర్యవేక్షకులను ఆదేశించారు. ముఖ్యంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
తరువాత అన్నప్రసాద వితరణను పరిశీలించారు. ముందుగా అన్నప్రసాద వితరణకుగాను వండిన వంటకాలను స్వయంగా పరిశీలించారు. తరువాత అన్నదాన భవనములోని వంటశాల, అన్నదానం స్టోర్లను పరిశీలించారు. స్టోరులో స్టాకు రిజిస్టరును పరిశీలించారు.
అన్నప్రసాద వితరణ సమయములో సంబంధిత అధికారులు ప్రతి హాలులో కూడా అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేటట్లు పర్యవేక్షిస్తుండాలన్నారు.