
భారీ వర్షం… పొంగిన వాగులు
జిల్లాలో అత్యధికంగా కొత్తపల్లి మండలంలో 103.8 మి.మీ వర్షపాతం నమోదు
కొత్తపల్లి యువతరం విలేఖరి;
మండలంలోని పలుగ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగాయి. జిల్లాలో అత్యధికంగా 103.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం రాత్రి 11 గంటలకు వర్షం ప్రారంభమయ్యి బుధవారం తెల్లవారు జామున వరకు వర్షం కురిసింది. నందికుంట, బావాపురం, శివపురం, సింగరాజుపల్లి, పెద్దగుమ్మడాపురం, ముసలిమడుగు, ఎర్రమరం తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. నందికుంట గ్రామంలో ప్రధానరహదారి పై వర్షపు నీరు ఆగడంతో ఆత్మకూరు పట్టణానికి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ముసలిమడుగు గ్రామంలో ముస్లీం కాలనీలో వర్షపు నీరు రహదారి పై వర్షపునీరు ఆగింది. కొత్తమడుగు నుంచి దుద్యాల వచ్చే దారిలో సుద్దవాగు పొంగి రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎం లింగాపురం గ్రామంలో ప్రధాన రహదారి పై వర్షపు నీరు ఆగడంతో జారీ పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.