ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిఇఓ కి వినతి
ములుగు యువతరం ప్రతినిధి.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈవో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ మాట్లాడుతూ.. విచ్చలవిడిగా ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి వసతులు లేకుండా షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా వారికి ఇష్టానుసారంగా స్కూల్స్ నడుస్తున్నాయి. ఎలాంటి నియమ నిబంధన లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. బుక్స్ అమ్ముతున్నారు రేకుల షెడ్డులో విద్యాసంస్థలు నడుపుతున్నాయి అని వారు అన్నారు. తక్షణమే ప్రైవేటు విద్యాసంస్థల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు. అదేవిధంగా సమస్యలు పరిష్కరించిన యెడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో రాజకుమార్, గణేష్, రాజు, రమేష్ ప్రవీణ్ నరేష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.