ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకిరి
ఎమ్మిగనూరులో వెలుగు చూసిన వైనం

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో వెట్టిచాకిరి
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో చీపురు పట్టిస్తున్నారు. పోనీ ఇదేదో ఎక్కడో జరిగిందనుకుంటే కాదు కాదు.స్వయాన ఓ ప్రభుత్వ పాటశాల టీచర్ ఇంట్లో విద్యార్థులతో చెట్ల కుంపట్లుఎత్తించటం, కసువు కొట్టించటం లాంటి పనులు చేయిస్తున్నారు. ఇలానే ఇంటి పనులు చేయిస్తూ పోతే విద్యార్థులు బాల కార్మికులుగా మారే అవకాశంమెండుగా ఉంది. దీంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న ప్రభుత్వ సంకల్పం నీరుగారే అవకాశం ఉంది. విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న అధ్యాపకురాలుపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఉన్నత అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తే మరో పది మంది ఇట్టే ప్రవర్తించే అవకాశం ఉంది. ఈ ఘటన పట్టణంలోని హెచ్.బి.ఏస్ కాలనీలో ఓ ప్రభుత్వ టీచర్ ఇంట్లో చోటు చేసుకుంది. పని చేస్తున్న విద్యార్థులను విచారించగా వీవర్స్ కాలనీ జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులుగా తెలిపారు. టీచర్ ఆదేశించగా ఇంటి పని చేయడానికి వచ్చినట్లు తెలిపారు. ఏదేమైనా ఈ సంఘటనపై సమ్మతిరు అధికారులు విచారణ జరిపి మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది.